Saturday 30 April 2016

VEDUKONDAAMAA Song Lyrics

ANNAMAYYA KEERTHANAS VEDUKONDAAMAA – TELUGU


రచన: అన్నమాచార్య
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||
ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు | 
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ||
వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు | 
గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||
ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు | 
అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ||

VINNAPAALU VINAVALE song lyrics

విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ||
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు |
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ||
గరుడ కిన్నరయక్ష కామినులు గములై |
విరహపు గీతముల వింతాలాపాల |
పరిపరివిధముల బాడేరునిన్నదివో |
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ||
పొంకపు శేషాదులు తుంబురునారదాదులు |
పంకజభవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను |
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ||

RANGA RANGA RANGAPATI song lyrics

రంగ రంగ రంగ పతి రంగనాధా నీ |
సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ||
పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు |
ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె |
రట్టడివి మేరమీరకు రంగనాధా |
రంగనాధా శ్రీ రంగనాధా ||
కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి |
రావు పోవు ఎక్కడికి రంగ నాధా |
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి |
ఏవల చూచిన నీవేయిట రంగనాధా ||
రంగనాధా శ్రీ రంగనాధా

PIDIKITA TALAMBRAALA Song Lyrics

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత |
పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద |
పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు |
పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||
బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర |
బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి |
బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె |
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను |
పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||

No comments:

Post a Comment