Saturday 30 April 2016

telugu jati manadi ninduga velugu jati manadi Song Lyrics

తల్లా పెళ్లామా : తెలుగు జాతి మనది

Movie(చిత్రం) : Thalla pellama(తల్లా పెళ్లామా)(1970)
Cast : N T Rama Rao, Harikrishna, Santha Kumari
Music (సంగీతం) : T V Raju(టి.వి.రాజు )
Director() : Rama Rao
Producer () : 
Song Lyric : telugu jati manadi ninduga velugu jati manadi
Singer(s)(గానం) : ఘంటసాల
Lyricist(రచన) : సి.నారాయణరెడ్డి

పల్లవి : 

తెలుగుజాతి మనది
నిండుగ వెలుగు జాతిమనది ॥
తెలంగాణ నాది రాయలసీమ నాది
సర్కారు నాది నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా...

చరణం : 1 

ప్రాంతాలు వేరైనా 
మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా 
మన బాస తెలుగు బాసన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా...
వచ్చిండన్నా వచ్చాడన్నా 
వరాల తెలుగు ఒకటేనన్నా

చరణం : 1

మహాభారతం పుట్టింది 
రాణ్మహేంద్ర వరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్నా...
ఈ రెంటిలోన ఏదికాదన్నా 
ఇన్నాళ్ల సంస్కృతి నిండుసున్న ॥

చరణం : 3 

పోచంపాడు ఎవరిది?
నాగార్జునసాగరమెవరిది? ॥
మూడు కొండ్రలూ కలిపి దున్నిన
ముక్కారు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలౌ 
ఐదుకోట్ల తెలుగువారిది ॥

చరణం : 4 

సిపాయికలహం విజృంభించ 
నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కీ జై...
గాంధీ నెహ్రూల పిలుపులందుకొని
సత్యాగ్రహాలు చేశాము
వందేమాతరం... వందేమాతరం...
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట
స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర...
దేశభక్తిలో తెలుగువారికి 
దీటే లేదనిపించాము ॥

చరణం : 5 

ఇంటిలోన అరమరికలు ఉంటే 
ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే 
కనుగ్రుడ్డు పెరికివేయాలా
పాలుపొంగు మన తెలుగు గడ్డను 
పగలగొట్టవద్దు (2)
నలుగురిలో మనజాతి పేరును
నవ్వులపాలు చెయ్యొద్దు

Telugu Jathi Manadi..!

Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi
Telangana Nadhi, Rayalaseema Nadhi, Sarkaru Nadhi, Nelluru Nadhi
Anni Kalisina Telugu Nadu Manadhe Manadhe Manadhera
Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi

Pranthalu Veraina, Mana Antharanga Mokatenanna
Yasalau Verugu Unna, Mana Basha Telugu Bashanna
Vachindanna Vachedana (Laugh)
Vachindanna Vachedanna Vachindanna Vachedanna
Varala Telugu Okatenanna
Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi

Mahabharatamu Puttindi Ranmahendravaramlo
Bhagavatamu Velasindi Ekasila Nagaramlo
Ee Rentilona Edi Kadanna Ee Rentilona Edi Kadanna
Innalla Samskruthi Nindu Sunna
Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi

Pochampadu Evaridi, Nagarjuna Sagaramu Evaridi
Pochampadu Evaridi, Nagarjuna Sagaramu Evaridi
Moddu Kondalu Kalipi Dunnina
Mukharu Pantalu Bandlakethina
Annapuranamma Kanna Biddalamu
Aidu Kotula Telugu Varimi
Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi

Sipayi Kalaham Vijrubincha Narasimhalai Garjinchanmu
Gandhi Nehrula Pilupulu Andukoni Sathyagrahalu Chesamu
Svarajya Siddi Jarigina Pimmata Svarastramunu Sadinchamu
Desha Bhakthilo Telugu Variki Dheete Ledanipinchamu
Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi

Intilona Aramarikalu Unti Illekki Chatala
Kantilonakala Theeyalante Kanuguddu Periki Veyala
Paalu Pongu Mana Telugu Gaddanu Pagalagottavadu
Paalu Pongu Mana Telugu Gaddanu Pagalagottavadu
Nalugurilo Mana Jaathi Peruni Navvulapalu Cheyadu

Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi
Telangana Manadhi, Rayalaseema Manadhi
Sarkaru Manadhi, Nelluru Manadhi
Anni Kalisina Telugu Nadu Manadhe Manadhe Manadhera
Telugu Jaathi Manadhi, Ninduga Velugu Jaathi Manadhi

No comments:

Post a Comment