Ammanu minchi Daivam unnada song lyrics 20va Satabdham, 20 వ శతాబ్దం : అమ్మను మించి దైవమున్నదా
Movie(చిత్రం) : 20va Satabdham(20 వ శతాబ్దం)(1990)
Cast : Suman , Lizi,Ranganath
Music(సంగీతం) : J.V. Raghavulu(జె.వి.రాఘవులు)
Director() : Kodi Ramakrishna
Producer () :
Song Lyric : Ammanu minchi daivamunnada
Singer(s)(గానం) : Balu(ఎస్.పి.బాలు),Suseela(పి.సుశీల)
Lyricist(రచన ) : Dr C NayaranaReddy(డా॥సి.నారాయణరెడ్డి)
పల్లవి :
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే ॥
చరణం : 1
రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీతలాగ తాను
కోటి ఉగాదులేనా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
చరణం : 2
తప్పడడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రీ అని
గుండె కద్దుకున్నావు
తప్పడడుగులేస్తే ఈనాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే (2)
ఐనా నీ ముంగిట
అదే అదే పసివాడినే